Wednesday 30 July 2014

మట్టి మనుషులు

వాళ్ళు మనుషులే
పనిమనుషులు!
ఎప్పుడు పిలిస్తే అప్పుడు
పనిచేసే శ్రామికులు!
మట్టి వాసనకు
మనిషి వాసనకు
తేడా తెలియని మనుషులు !
నెల రోజుల్లో ఒక్కరోజు కూడా
సెలవులేని అభాగ్యులు!
చాలిచాలని జీతంతో
సంసారసాగరం ఈదే నిర్భాగ్యులు!
పసిపిల్లల ముద్దుముచ్చట
 తీర్చలేని మౌనజీవులు!
కదిలే కాలచక్రంలో
 కండలు అరగదీసే కార్మికులు!
ఎప్పుడు పొద్దుపోడుస్తుందో
ఎప్పుడు పొద్దువాళ్తుందో
గుర్తేలేని శ్రమజీవులు!
జీవనపరుగులో అలిసిపోయి
బక్కచిక్కిపోయిన శరీరాలతో
మగ్గిపోయిన బ్రతుకులు
వర్కర్ల జీవితాలు. 

Monday 28 July 2014

గారాల పట్టి

SRINIVAS PINDIGA: gaaraala patti: గారాల  పట్టి  కొడుకైనా  కూతురైనా  నీవేనమ్మా నా   వరాలతల్లి! నీవు మా కళ్ళముందు వెలసిన క్షణమే హృదయం ఉప్పొంగి నాన్న కళ్ళు మెరిశాయి ! నిన...

Saturday 26 July 2014

గారాల పట్టి

కొడుకైనా  కూతురైనా  నీవేనమ్మా
నా   వరాలతల్లి!
నీవు మా కళ్ళముందు వెలసిన క్షణమే
హృదయం ఉప్పొంగి నాన్న కళ్ళు మెరిశాయి !
నిన్ను ఊపిన ఊయలను చూస్తే
నీవింక ఉగ్గుపాలు తాగే
పసిపాపవనే అనిపిస్తుంది తల్లీ !
నీకు గోరుముద్దలు తినిపించి
మేం పస్తులున్న రోజులెన్నో ఉన్నాయమ్మా !
నీకు జ్వరం వస్తే మీ నాన్న
ఎంత తల్లడిల్లేవాడో నీకు తెలీదు
నా గారాల పట్టీ !
నీవు స్కూల్ డ్రెస్ వేస్కొని
"డాడి  నేను స్కూల్ కి బోతా" అంటే
నా చిట్టితల్లి అప్పుడే ఎన్ని పుస్తకాలు
మోయాలో అని ఏడ్చేశాడమ్మా !
ఇప్పుడు నువ్వు కాలేజికి వెళ్తున్నావు!
అదిగో నాన్న గుండెల్లో
రైళ్ళు పరిగెడుతున్నాయి...!


(ఆమ్లదాడుల నేపధ్యం లో .........  )

Friday 25 July 2014

పొద్దు పొడుపు

చూచిరాతల నుంచి
స్వంతరాతల వైపు
అడుగులిప్పుడే వేస్తున్నాను !
జ్ఞాన తృ ష్ణ లోని నిజమైన
గమ్యాన్ని తెలుసుకుంటున్నాను!
జీవితమంటే  ఆనందాన్ని వెతుక్కో వడమనే
సత్యం బోధపడింది !
జీవించడమంటే మన ముద్రను సమాజంపై వేయడమే
అనే తత్వం అలవడింది !
మార్గదర్శకత్వం లేని గమ్యం
తెగిన గాలిపటమే!
మనకోసం మనం
జీవించని జీవితం దుర్భరమే !
ఇకపై 
నడుస్తున్న చరిత్రను 
తెలుసుకోలేని అభాగ్యుడిగ మిగిలిపోను !
నేనే కొత్త చరిత్రను నిర్మిస్తాను!
పొడుస్తున్న పొద్దులా 
ఉదయిస్తాను.