Saturday 26 July 2014

గారాల పట్టి

కొడుకైనా  కూతురైనా  నీవేనమ్మా
నా   వరాలతల్లి!
నీవు మా కళ్ళముందు వెలసిన క్షణమే
హృదయం ఉప్పొంగి నాన్న కళ్ళు మెరిశాయి !
నిన్ను ఊపిన ఊయలను చూస్తే
నీవింక ఉగ్గుపాలు తాగే
పసిపాపవనే అనిపిస్తుంది తల్లీ !
నీకు గోరుముద్దలు తినిపించి
మేం పస్తులున్న రోజులెన్నో ఉన్నాయమ్మా !
నీకు జ్వరం వస్తే మీ నాన్న
ఎంత తల్లడిల్లేవాడో నీకు తెలీదు
నా గారాల పట్టీ !
నీవు స్కూల్ డ్రెస్ వేస్కొని
"డాడి  నేను స్కూల్ కి బోతా" అంటే
నా చిట్టితల్లి అప్పుడే ఎన్ని పుస్తకాలు
మోయాలో అని ఏడ్చేశాడమ్మా !
ఇప్పుడు నువ్వు కాలేజికి వెళ్తున్నావు!
అదిగో నాన్న గుండెల్లో
రైళ్ళు పరిగెడుతున్నాయి...!


(ఆమ్లదాడుల నేపధ్యం లో .........  )

No comments:

Post a Comment