Sunday, 29 November 2015

Poolajaathara

...పూల జాతర...
తంగేడు పూలు తురమంగ
గునుగుకు రంగులు పులమంగ
మనసు మురవంగ
తనువు పులకరించంగ
ఆడుదాం బతుకమ్మ!
ఆడబిడ్డలు ఇంట అడుగిడంగ
చిన్ననాటి దోస్తులు కలవంగ
అన్నలు పూలు కోయంగ
ప్రకృతి పరవశించంగ
ఆడుదాం బతుకమ్మ!
చెరువుగట్లు పిలవంగ
వెంపలి చెట్లు నాటంగ
అవ్వలు పాటలు పాడంగ
పడచులు కోలాటమేయంగ
ఆడుదాం బతుకమ్మ!
చిన్నారుల టపాసులు పేల్చంగ
బతుకమ్మలు చెరువు ఒడిలో వొదగంగ
పప్పుబెల్లాల తీపి పంచుకోంగ
ప్రకృతిఒడిలో గడపంగ
ఆడుదాం బతుకమ్మ...!
     - Srinivas Pindiga