Saturday 24 September 2022

haritham

  "తెలంగాణకు హరితహారం" పథకం అమలు- విశ్లేషణ
ఉపోద్ఘాతం:
నేడు ఆధునిక మానవుడు తన మేధస్సుతో సాంకేతికంగా ఒకవైపు వినూత్న వస్తువులు సృష్టిస్తూ మరోవైపు సహజ వనరుల విధ్వంసానికి కారణమవుతున్నాడు. విలాసవంత జీవనంకై పట్టణీకరణకు ప్రాధాన్యతనివ్వడంతో క్రమంగా అటవీ విస్తర్ణం తగ్గిపోయింది. దీని వలన వాతావరణంలో పెనుమార్పులు సంభవించి భూతాపం పెరగడం, జీవ వైవిధ్యం కనుమరుగవడం వంటి సమస్యలు మానవాళి మనుగడకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. "వృక్షో రక్షతి రక్షతః" అన్నట్లు పచ్చదనం పరిఢవిల్లేలా కృషిచేయడం వల్లనే ఈ పెను ప్రమాదాన్ని ఎదుర్కోగలం. ఇలాంటి తరుణంలో "తెలంగాణకు హరితహారం" వంటి పథకం ఓ బృహత్తర యజ్ఞంగా చెప్పవచ్చు.
రోజు రోజుకు తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం వలన వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, జంతువులకు తలదాచుకునే చోటు లేకపోవడం వంటి వాటిని నివారించేందుకు "తెలంగాణకు హరితహారం" తోడ్పడుతుంది. విరివిగా మొక్కలు నాటడం వలన పర్యావరణ సమతుల్యత సాధించగలం. ప్రస్తుత తరుణంలో ఇలాంటి హరిత కార్యక్రమాల వల్లనే గ్లోబల్ వార్మింగ్, హరితగృహ ప్రభావం, ఓజోన్ పొర దెబ్బతినడం వంటి వాటిని నివారించి భవిష్యత్తు తరాలకు పర్యావరణ హిత భూగోళంను కానుకగా ఇచ్చేందుకు వీలుంటుంది. కావున ప్రపంచమంతటా భూమిపై పచ్చదనాన్ని కాపాడుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ప్రణాళిక బద్ధంగా హరిత పృథ్విని సాధించాల్సిన అవసరం ఉంది.
"తెలంగాణకు హరితహారం పథకం: రూపకల్పన
ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ హౌజ్ గ్యాసెస్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అనేక దేశాలు ప్రపంచ దేశాల్లో ఈ కార్యక్రమాల కోసం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అన్ని దేశాలు భూగోళంపై ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రీన్ కవర్ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజలందరి భాగస్వామ్యంతో జరగాలి. తెలంగాణలో 24 శాతం అడవి ఉంది. 33 శాతం అడవి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో అడవి ఎక్కువ ఉంది. మరికొన్ని చోట్ల అడవి లేదు. సమతుల్యం అవసరం. రిజర్వు ఫారెస్టులలో కూడా అడవి లేదు. చెట్లు లేవు. దీనికి చాలా కారణాలున్నాయి. అడవి జీవితంలో భాగంగా ఉండేది. తర్వాత పరిస్థితి మారింది. నగరీకరణ, పట్టణీకరణ పెరిగింది. లెక్కల్లో 24 శాతం అడవి ఉన్నట్లు తేలుతున్నా, వాస్తవంగా అంతకన్నా తక్కువ అడవి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా మూడు, నాలుగు మీటర్ల చెట్టు లేవు. అందుకోసం 27 లక్షల హెక్టార్ల అటవీ భూమిలో విరివిగా చెట్లు పెంచాలి. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. అటవీ ప్రాంతంలో రూట్ స్టాక్ గుర్తించి, చెట్లు పెంచాలి. రూట్ స్టాక్ లేని చోట కొత్తగా మొక్కలు నాటాలి. ప్రజల భాగస్వామ్యంతో హరిత హారం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ పెంచాలని ‘తెలంగాణకు హరితహారం’ అనే పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు రూపకల్పన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 40 లక్షల మొక్కలు పెంచు తున్నారు. ఇందుకోసం గ్రామాలలోనే నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ జూలై రెండవవారంలో నాటడానికి నర్సరిలో మొక్కలు సిద్ధమయ్యాయి. వచ్చే రెండేళ్ల ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం మొక్కల పెంపకం చేపడుతున్నారు. జూలై రెండవ వారంలో ‘హరితహారం వారోత్సవం’ నిర్వహిస్తారు.
కార్యాచరణ:
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది.అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన 15.86 లక్షల మొక్కలను నాటడం జరిగింది.
రెండవ విడత హరితహారం కార్యక్రమం జూలై 8, 2016న రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో జూలై 8న మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దశలో 46 కోట్ల మొక్కలు నాటి లక్ష్యాన్ని చేరుకున్నారు.



హరితహారం పథకం ఉద్దేశ్యాలు :
1. తెలంగాణలో ఉన్న 24 శాతం అటవీ ప్రాంతంలో నూటికి నూరు శాతం అడవులు పెంచడం
2. పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం
3. తెలంగాణ వ్యాప్తంగా ఐదేళ్ల కాలంలో 230 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం
4. అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలు, హైదరాబాద్ నగర పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటడం
5. సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం
6. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం
7. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం
8. సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం
9. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.
పట్టుబట్టి, జట్టుకట్టి హరితహారాన్ని విజయవంతం చేద్దాం..! – కే.సీ.ఆర్ ఉద్ఘాటన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి తో ఇప్పుడు పట్టుబట్టి, జట్టుకట్టి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హరితహారం విజయవంతం చేసి వానలను తిరిగి రప్పించుకోవాలన్నారు. వానలు హరితవనాల వల్ల వస్తాయి కానీ డబ్బులు పెట్టి కొనలేమన్నారు. కోట్ల రూపాయలు వెదజల్లినా వానలు రావన్నారు. అందువల్ల వనాలు పెంచితేనే వర్షాలు వస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగాలన్నారు. నల్లగొండ జిల్లాలో 5.9 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతితక్కువ అడువులు ఉన్న జిల్లా నల్లగొండ జిల్లా మాత్రమేనన్నారు. ఈ జిల్లాలో అడవుల శాతం పెంచడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టిన మొక్కలు వందశాతం బతికించాలన్నారు. అడవులు నశించడంతో అడవుల్లో ఉండే కోతులు గ్రామాలపై పడి అల్లరల్లరి చేస్తున్నాయన్నారు. కోతులు ఊళ్ళో నుంచి పోవాలంటే అడవులు పెరగాలన్నారు. గతంలో ఉన్న అడవులను మనం విచక్షణారహితంగా కొట్టివేయడంతో కోతులకు అడవుల్లో ఆహారం కరువైందన్నారు.
అడవుల్లో ఒకప్పుడు రకరకాల పండ్లు తునికి, రేగి, ఉసిరి, మేడి ఇలా ఎన్నొ జాతుల పండ్లు ఉండేవి. వాటిని తిని కోతులు కడుపునింపుకునేవన్నారు. అడవిలో చెట్లు కొట్టివేతలకు గురికావడంతో పండ్లు కరువై అవి తమ కడుపు నింపుకోవడానికి గ్రామాలపై పడుతున్నాయన్నారు. ఏ ఊరుకు వెళ్ళినా కోతుల బెడద గురించి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. మనం ఆంజనేయస్వామిగా కొలిచే కోతుల సమస్య జటిలం కాకుండా ఉండాలంటే అడవులు పెరగాలన్నారు. గత సంవత్సరం వర్షాలు లేక కరువు ఏర్పడిందన్నారు. వర్షాలు పడాలంటే అడవులు, పచ్చదనం ఎంతో ముఖ్యమన్నారు. అందుకై మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపుచేయడం ఒక్కటే మార్గమన్నారు.
మన ఇంటిని మనమే బాగుచేసుకోవాలని, ఎవ్వరు వచ్చి బాగుచేయరని గుర్తెరగాలన్నారు. ఈ పదిరోజులు పాఠశాల విద్యార్థి నుంచి సీఎం వరకు 24గంటలు ఈ పనిలోనే ఉండాలని పిలుపునిచ్చారు. చెట్లు పెంచుకోవడమంటే మనల్ని మనం బాగుచేసుకోవడమే అన్నారు. అడవులు ఉన్న చోటనే వర్షాలు పడుతున్నాయని, చెరువులు నిండి అలుగులు పారుతున్నాయన్నారు. దీన్ని గ్రహించి తమ తమ ప్రాంతాలలో వానలు పడాలంటే చెట్లు పెంచాలనే ద్యాస కలిగి ఉండాలన్నారు. హరితహారంపై ప్రజల్లో చైతన్యం తేవడానికి కవులు పాటలు రాయాలని, గాయకులు గళం విప్పాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో: రాజధాని హైదరాబాద్‌లో జూలై 10న ఒకేరోజు 29లక్షల మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌తో పాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మేయర్‌ బొంతు రాంమోహన్‌ పలుచోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ హరితహారాన్ని ప్రజా ఉద్యమంలా నడిపించాలని అన్నారు. తరగిపోతున్న అడవులు వాతావరణంలో మార్పులకు కారణమన్నారు. అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. పండ్ల మొక్కలు పెంచితే జీవనోపాధి కూడా కలుగుతుందని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా చూడాలని ప్రజలను కోరారు.
హరిత హారం – ముఖ్యమంత్రి మనోగతం
తెలంగాణ ముద్దు బిడ్డలకు హరితాభివందనాలు…
తెలంగాణకు హరితహారం ఒక అపూర్వమైన కార్యక్రమం భారత దేశ చరిత్రలో తెలంగాణ లిఖిస్తున్న ఆకుపచ్చని అధ్యాయం. ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగాలి. ప్రతి పౌరుడు మొక్కలు నాటి పచ్చదనం కోసం పాటు పడాలి. పట్టుబట్టి జట్టు కట్టి ఎట్లనైతే తెలంగాణను సాధించుకున్నామో అట్లనే కోట్లాది మొక్కలు నాటాలె. ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించాలె.

మనిషి లేకున్నా చెట్టూ చేమ మనుగడ సాగిస్తాయి. కానీ చెట్లు లేకుంటే మనిషి బతుకు ఎడారే. విస్తారమైన అటవీ సంపద తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. ఉష్ణోగ్రతలు పెరుగకుండా చేసేవి, అతివృష్టి, అనావృష్టిలతో కాలం తప్పకుండా కాపాడేవి చెట్లే. వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురికాకుండా నిలబెట్టేవి చెట్లే. ఒక్క మనిషికే కాదు సకల జీవరాశి మనుగడకు వృక్ష సంపదే మూలం. పుట్టిన నాడు ఊపే ఊయల నుంచి మరణించిన నాడు పేర్చే చితి దాకా మానవ జీవితం చెట్టుతో ముడిపడి వుంది. ఒక చెట్టు నలుగురు మనుషులకు సరిపోయే ప్రాణవాయువునందిస్తుంది. ఒక టన్ను కార్చన్‌ డై అక్సైడ్‌ను తగ్గిస్తుతుంది. క్షమించరాని మానవ తప్పిదాల వల్లనైతేనేమి, అవసరాలు, అనివార్యతల వల్లనైతేనేమి విచక్షణారహితంగా మనం అడవులను నరికివేస్తున్నాం ఫలితంగా తీవ్రమైన ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయి. భరించలేనంత స్థాయికి ఉష్ణోగ్రత పెరుగుతున్నది. అన్ని కాలాలు ఎండాకాలాలైపోతున్నయి. వర్షాలు లేక వరుస కరువులు వస్తున్నాయి. దీంతో పాటు ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించేందుకు పచ్చదనం పట్ల ప్రజల్లో సోయి పెంచేందుకు, కోట్లాది మొక్కలు నాటేందుకు రూపొందించిన మహత్తర పథకమే తెలంగాణకు హరితహారం. వనం వుంటేనే వానలు ఉంటయి. పైసలు పెట్టి కొనేటందుకు వానలు మార్కెట్లో దొరకవు. ప్రకృతి ఇచ్చే వరం వానలు. చెట్లు నాటితే చెట్ల గాలితో మబ్బులు చల్లపడి వానలు కురుస్తయి. మనం మన అవసరాల పేరుతో అడివి మీద పడుతున్నాం. అడవిలో కోతులు ఊర్లమీద పడుతున్నయి. పంటలను, పండ్ల తోటలను నాశనం చేస్తున్న కోతులు ఇప్పుడు మనకు పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారం వనాలను పునరుద్ధరించడమే. అందుకే ఇప్పుడు మన నినాదం వానలు వాపస్‌ రావాలె… కోతులు అడవికి పోవాలె… ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కడైతే అడవి వుందో అక్కడనే వానలు పడ్డయి. ఈ పరిస్థితిని గమనించి అందరం అడవులను సంరక్షించడానికి చెట్లను నాటటానికి నడుం కట్టాలె.

తెలంగాణకు హరిత హారం ద్విముఖ వ్యూహంతో సాగే కార్యక్రమం.
1) సహజసిద్ధమైన అడవులను పరిరక్షించడం, పునరుజ్జీవింపచేయడం. అటవీ భూముల దురాక్రమణను అడ్డుకోవడం. పెద్ద ఎత్తున సాగే వృక్షాల నరికివేతను నిలువరించడం.
2) ఇదే సమయంలో దీనికి సమాంతరంగా సామాజిక అడవుల పెంపకానికి పెద్దఎత్తున చర్యలు చేపట్టడం. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటి సంరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టడం.
కార్యక్రమ ప్రణాళిక:
--వచ్చే నాలుగేళ్ల పాటు హరిత హారం కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలి. ఇజిఎస్ తో అనుసంధానం చేస్తారు. నర్సరీల సంఖ్య బాగా పెంచాలి. వ్యవసాయ, రెవిన్యు, పంచాయతిరాజ్ అధికారులతో సమన్వయం కుదుర్చుకోని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.
--వాటర్ గ్రిడ్ కార్యక్రమంతో నీటికి కూడా కొరత ఉండదు. రిజర్వాయర్ల దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో నర్సరీలు పెట్టాలి. జిల్లాల్లో ఉండే డ్యామ్లను వాడుకోవాలి. ఆ నీటిని మొక్కలకు వాడాలి.
-- ప్రతీ ఏడు జులై రెండవ వారంలో హరిత హారం కార్యక్రమం నిర్వహించాలి. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని రక్షించడమూ అంతే ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, రైస్ మిల్లులు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, వైద్య శాలలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచాలి. ఎండా కాలంలో మొక్కలు కాపాడటానికి ఐదారు కిలోమీటర్లకు ఒక బోరు వేయాలి.
-- మొక్కలు నాటడం ఉద్యమంలా సాగాలి. హరిత దళాలు తయారు కావాలి.
-- తెలంగాణ భూభాగంలో 33శాతం అడవి వుండి తీరాలి. చెరువులో నీళ్ల చుట్టూ చెట్లు పెంచాలి.
-- అడవిని రక్షించే విషయంలో అటవీశాఖ అధికారులకు అవసరమైన భద్రత కల్పిస్తాం. స్మగ్లర్లు, అగ్నిప్రమాదాలు, కబ్జాల వల్ల అడవి అంతరిస్తోంది. ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. అటవీశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలి.
-- రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి, అటవీ భూముల హద్దులు నిర్ణయించాలి. ఒక ఇంచు అటవీ భూమి కూడా పోవద్దు. కలప స్మగ్లర్లు, అటవీ భూములను కబ్జా చేసే వారిపై పిడి యాక్టు ప్రయోగించాలి. అటవీ సిబ్బందికి వాహనాలు సమకూరుస్తారు. ప్రతి కన్సర్వేటర్ వద్ద రూ.20 లక్షలు, ప్రతీ డిఎఫ్ఓ వద్ద రూ.10 లక్షలు అటవీ సంరక్షణ కోసం అప్పటికప్పుడు ఖర్చు పెట్టడానికి నిధులు ఇస్తారు. డిఎఫ్ఓలకు జీపులు, ఫారెస్టర్లకు మోటార్ సైకిళ్లు కొనిస్తారు.
-- హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో మొక్కలు కాపాడడానికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలి. స్మశాన వాటికలు, బరేల్ గ్రౌండ్స్ లాంటి చోట్ల కూడా మొక్కలు నాటాలి.
-- అన్ని జిల్లాల్లో కలెక్టర్లు నర్సరీలను పరిశీలించాలి. అటవీ ప్రాంతాల్లో, జనావాస ప్రాంతాలకు సమీపంలో కోతులు తినే పండ్ల చెట్లు పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
-- హరితహారం కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో సాగాలి. కలెక్టర్లు సమన్వయం చేయాలి. ప్రచారం కోసం పోస్టర్లు, పాటలు, టి షర్ట్స్, బ్యాడ్జీలు, టోపీలు వాడాలి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పాటల పోటీలు నిర్వహిస్తారు.
-- ప్రహరి గోడలున్న ప్రాంగణాల్లో ఎనిమల్ ట్రాప్స్ ఏర్పాటు చేయనున్నారు.
-- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటాలి. ప్రతి నియోజకవర్గంలో 100 గ్రామాల్లో 40 వేల చొప్పున మొక్కలు నాటాలి. రైతులను భాగస్వాములను చేసి మామిడి, చింత, టేకు లాంటి పండ్ల చెట్లు, నీడ చెట్లు పెంచాలి.
-- కలెక్టర్లు ప్రతి వారం హరిత హారంపై సమీక్ష నిర్వహించడం జరుగుతుంది.
-- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల కండువాలు, టోపీలు అందించనున్నారు.
-- ప్రజా ప్రతినిధులను కలుపుకు పోవాలి. ఎవరికి వారు శ్రమదానంతో మొక్కలు నాటాలి.
-- బలహీన వర్గాల కాలనీల్లో ఇంటికి రెండు, మూడు పండ్ల చెట్లు పెంచాలి.
-- అటవీ భూములు కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. కబ్జా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఈ విషయంలో బాగా పనిచేసిన వారికి అవార్డులు, పదోన్నతులు కల్పిస్తాం.
-- గ్రామ హరిత రక్షణ కమిటీలు నియమించాలి.
-- “హరితం శివం సుదరం” అనే భావన రావాలి.



హరితహారం-అమలు:
ఈ పథకం ను విజయవంతంగా అమలుచేయడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది.
1)గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చెపట్టడం జరిగింది.
2)ఎక్కువ మొక్కలు నాటేవారికి ప్రోత్సహకాలను ప్రకటించడం జరిగింది.
3)లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు రూ.2 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందజేస్తారు.
4)ఖాళీ స్థలాలు గుర్తించి విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు.
5)రహదారులకు ఇరువైపులా హరిత పందిరి నిర్మించేలా ప్రణాళికలు రచించారు.
6)ప్రజలు,విద్యార్థులు,విద్యాసంస్థలు,అధికారుల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన చేశారు.
7)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల భాగస్వామ్యంతో విరివిగా మొక్కలు పెంచేలా నిర్ణయించారు.
8)మిషన్ కాకతీయ పథకం లో పూడిక తీసిన చెఱువు గట్లపై ఈత, తాటి చెట్లు విరివిగా నాటేలా డ్వామాకు బాధ్యతలు అప్పగించారు.
హరితహారం పథకం అమలు - విశ్లేషణ ప్రాజెక్టు లక్ష్యాలు:
1."తెలంగాణకు హరితహారం" పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించడం
2.హరిత తెలంగాణ సాధనలో "తెలంగాణకు హరితహారం" అందించే తోడ్పాటును విశ్లేషించడం
3.పర్యావరణ కాలుష్య నివారణలో "హరితహారం" పాత్ర తెలుసుకోవడం
4.హరితహారం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం
5.హరితహారం అమలులో గల సమస్యలను పరిశీలించడం.


తెలంగాణా హరిత హారం పథకం విశ్లేషణ:
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పచ్చబడి పశుపక్ష్యాదులతో, జీవరాశులతో కలకలలాడాలని "తెలంగాణకు హరితహారం" పథకంను ప్రారంభించడం ముదావహం.ఈ కార్యక్రమం పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్దది చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ఈ పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించినట్లయితే ప్రణాళికబద్ధంగా సాగుతోంది. ఈ పథకం ప్రారంభించిన మొదటి ఏడాది వానలు సరిగా పడకపోవడం వలన 40 కోట్ల మొక్కల లక్ష్యంలో కేవలం 15.86 కోట్ల మొక్కలనే నాటడం జరిగింది. అదే మలివిడతలో (2016) విస్తారంగా వర్షాలు కురవడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం గా మొదలై ప్రజాఉద్యమంలా సాగింది.
హరితహారం లో విస్తృతంగా మొక్కలు నాటడం వలన ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు పడేందుకు దోహదం చేసింది.అటవీ విస్తీర్ణం క్రమేణ పెరుగుతున్నట్లు ఇటీవల సర్వేల ద్వారా తెలుస్తుంది. హరిత తెలంగాణ సాధించేందుకు హరితహారం గొప్ప చోదకంగా పనిచేస్తుంది.ఇలాగే రానున్న దశల్లో విరిగా మొక్కలను నొటి సంరక్షించడం ద్వారా తెలంగాణ అంతటా హరితశోభతో వికసిస్తది.
కాలుష్యం ను నివారిస్తూ పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు హరితహారం గొప్ప ఆశాకిరణం. వాహనాలు ఇతర పరిశ్రమల ద్వారా విడదలైన కాలుష్య వాయువులను చెట్లు పీల్చుకొని మనకు ప్రాణవాయువును ఇస్తాయి. అడవుల నరికివేత వలన జీవులు జనావాసంలోకి రావడం, ఆహారపు గొలుసు దెబ్బతినడం, జీవవైవిధ్యం కనుమరుగవడం వంటివాటిని హరితహారం వంటి కార్యక్రమాల వల్ల నివారించి పర్యావరణ సమతుల్యత సాధించగలం.
హరితహారం వలన కలిగే ప్రయోజనాలు:
1. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం లో జీవించేందుకు దోహదపడుతుంది.
2. ప్రమాద స్థితి లో ఉన్న జీవులను పరిరక్షించేందుకు వనాల పెంపు అవశ్యం
3. కాలుష్యం ను నివారించవచ్చు
4.రుతుపవనాలు సరైన సమయంలో వచ్చేందుకు దోహదపడును.
5.భూతాపాన్ని నివారించవచ్చు
6.తెలంగాణ వ్యాప్తంగా అటవీవిస్తీర్ణం పెరిగి జీవుల జీవనప్రమాణాలు పెరుగుతాయి.
ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
హరితహారం పథకం అమలు లో గల సమస్యలు:
మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ట్రీ గార్డ్ లు ఏర్పాటు చేయాలి. లేకుంటే హరిత తెలంగాణ సాధ్యం కాదు. అలాగే వర్షాలు పడని సందర్భంలో మొక్కలకు విరివిగా నీరు అందేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొద్ది రోజుల కార్యక్రమంలా కాకుండా నిరంతరాయంగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంది మొక్కలు నాటడంలో ఉన్న ఉత్సాహం వాటిని పెంచడంలో కనిపించడం లేదు. ఇలాంటి సమస్యలను గుర్తించి సరిచేసుకొని ముందుకు పోతే తెలంగాణ తల్లిమెడలో పచ్చలహారం తొడిగినవాళ్ళం అవుతాం.
ఉపసంహారం:
తెలంగాణ పుడమితల్లి పరిరక్షణలో పునీతులయ్యే గొప్ప అవకాశం "తెలంగాణకు హరితహారం" పథకం కల్పిస్తుంది. ఇందుకై ప్రతి ఒక్కరు కంకణబద్ధులై నిబద్ధతతో మొక్కలు నాటే యజ్ఞంలో పాల్గొనేందుకు ప్రతినబూనాలి. అప్పుడే మన తెలంగాణ హరితవర్ణ కాంతులతో గుభాలిస్తది లేకుంటే భవిష్యత్ తరాలకు నిలువ నీడలేని పరిస్థితి దాపురిస్తది.అలాంటి పరిస్థితి రానీయకుండా పచ్చదన పరిరక్షణకై హరితదండులా కదలినప్పుడే తెలంగాణ తల్లికి హరిత కంఠాభరణం తొడుగగలం.

భైంసా పట్టణం చారిత్రక ప్రశస్తి

భైంసా పట్టణం చారిత్రక ప్రశస్తి
పరిచయం:
చరిత్ర ద్వారా మనం ఒక కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన తదితర అంశాలను మనం తెలుసుకోవచ్చు. అందుకు మనకు అనేక ఆధారాలు లభిస్తాయి. అవి కట్టడాల రూపంలో గానీ, నాణేల రూపంలో గానీ లేదా శాసనాల రూపంలో గానీ లేదా గ్రంథస్థరూపంలో లభించవచ్చు. ఒక ప్రాంత చరిత్రను మనం వీటిద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ప్రజలు తమ ప్రాంత చరిత్రను ఆశువుగా కథలు కథలుగా చెప్పుకుంటారు. చరిత్ర విద్యార్థులుగా ఒక ప్రాంతంను చారిత్రక కోణంలో పరిశీలిస్తే ఆ ప్రాంతంలో పూర్వికులు నివసించిన ఆనవాళ్ళు, వారు నిర్మించిన కట్టడాలు, వారు ఏర్పరచిన సంస్కృతి సాంప్రదాయాలు తర్వాతి తరాలకు వారసత్వంగా అందుతాయి.వీటిని పరిశోధించడం వలన మనం ఉంటున్న ప్రాంతచరిత్రను వెలికితీసి భావితరాలకు అందించవచ్చు.
తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. శాతావాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహిలు, అసఫ్ జాహీలు ఇట్లా అనేక రాజవంశాలు తమ పాలనలో ఎన్నో ప్రాంతాలను చారిత్రకంగా ఉజ్వలమయం చేశారు. అయితే కొన్ని ప్రాంతాలు చారిత్రక ప్రశస్తికి నోచుకొని పర్యాటకమయంగా విరాజిల్లుతున్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల గురించి ఎన్నో విషయాలు నేటికీ వెలుగుచూడలేదు.ఇట్లా వెలుగులోకి రాని ఒక ప్రాంతమే భైంసా.
భైంసా రెవెన్యూ డివిజన్ తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ప్రాంతం. భైంసాకు పూర్వనామం "మహిషాపురం".కాలక్రమేణ మహిషా భైంసా గా పిలువబడుతున్నది. భైంసా పట్టణం యొక్క చారిత్రక ప్రశస్తి, దాని పేరు వెనుక గల చరిత్రను వెలికితీయడమే మా పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
పరికల్పన:
భైంసా మహిషాపురం అని పిలవబడిన చారిత్రక ఆనవాళ్ళు నేటికీ గట్టు మైసమ్మ గుడిలోనూ దానికి సమీపంలో పడి ఉన్న మహిషాసుర పాదాలలో కలవు. వాటి అధ్యయనంనూ చారిత్రక కోణంలో పరిశీలించి భైంసా పేరు వెనుక గల కథనాలు, చరిత్రను తెలియజెప్పడం.
ఉద్దేశ్యాలు:
1.భైంసా పట్టణం యొక్క భౌగోళిక మరియు చారిత్రక ఆనవాళ్ళను అధ్యయనం చేయడం
2.భైంసా లో ఉన్న మైసమ్మ గుట్ట గుడి మరియు మహిషాసుర పాదాల చారిత్రక ప్రశస్తిని వెలుగులోకి తేవడం
3.భైంసాలో గల ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను గుర్తించడం
4.భైంసా పేరు వెనుక గల చారిత్రక ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం
5. భైంసా లో గల సాంఘిక-మత పరిస్థితులను పరిశీలించడం
6. భైంసా లో గల పర్యాటక ప్రదేశాలు గుర్తించడం
పరిధి:
భైంసా పట్టణం యొక్క చారిత్రక ప్రశస్తిని అధ్యయనం చేయడమే మా పరిశోధన పరిధి. భైంసా ప్రాంతంలోని ప్రజల సంస్కృతి, సాంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పండగలు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను తెలుసుకోవడం.

భైంసా పట్టణం భౌగోళిక పరిస్థితులు:
భైంసా పట్టణం నిర్మల్ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది పూర్వం ఆదిలాబాద్ జిల్లాలో ఉండేది.భైంసా రెవెన్యూ డివిజన్ తో పాటు ఒక మున్సిపాలిటి.ఇది మహారాష్ట్ర బార్డర్ కు దగ్గరగ ఉన్న టౌను.భైంసాకు మహిషాపురం అనే పేరు ఉంది.నిజాం రాజ్య పతనం తర్వాత 1956 దాకా నాందేడ్ జిల్లాలో ఉన్న భైంసా 1956లో భాషాప్రయుక్తరాష్ట్రాల్లో భాగంగ మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో కల్సింది. ఈడ తెలుగుతో పాటు హింది, ఉర్దు, మరాఠి ఎక్కువ మాట్లాడ్తరు.ఇక్కడ పత్తిమిల్లులు ఎక్కువ కలవు. పత్తి,సోయ, వరి,మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండిస్తారు. 2011జనాభా లెక్కల ప్రకారం భైంసా పట్టణ జనాభా దాదాపు 50 వేలు. భైంసా మునిసిపాలిటి 1934 లో ఏర్పడింది. 32 వార్డులు కలవు.
భైంసా పేరు వెనుక గల కథ:
భైంసాను పూర్వం మహిషాపురం అని పిలవడానికి గల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం మహిషాసురుడనే రాక్షస రాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురిచేసేవాడనీ, ప్రజలు విసిగిపోయి దుర్గామాతకు మొరపెట్టుకోగా విజయదశమి రోజున ఆమె మహిషాసురున్ని సంహరించి "మహిషాసురమర్థిని"గా ఈ ప్రాంతంలో కొలువై మైసమ్మ గుట్టపై గట్టు మైసమ్మగా వెలసిందని ప్రతీతి. ఇప్పటికీ మైసమ్మ గుట్టపై గుడి దాని సమీపంలో తెగిపడిన మహిషాసురుని రాతిపాదాలు కలవు.
గట్టు మైసమ్మ దేవాలయం:
మైసమ్మ గుట్టపై గట్టు మైసమ్మ దేవాలయం ఉంది. మహిషాసుర వధ అనంతరం "మహిషాసుర మర్థిని" అవతారంతో బోడ గుట్టపై గట్టు మైసమ్మ వెలిసింది.మైసమ్మ కోరిన కోరికలు తీర్చేతల్లి అని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రజలు అనారోగ్యం బారినపడినప్పుడు, సంతానం లేనప్పుడు ఇక్కడి అమ్మవారిని పూజిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని నమ్మకం.
గట్టు మైసమ్మ దేవాలయం భైంసా బస్టాండ్ కు 3 కి.మీ. దూరంలో కుంట ఏరియాలో గుట్టపై కలదు.మొదట ఎత్తైన బోడ గుట్టపై అమ్మవారు ఉండేది తదనంతరం భక్తుల సౌకర్యార్థం అమ్మవారి విగ్రహాన్ని బోడగుట్ట కింది భాగంలో ప్రతిష్టించి ఆలయం నిర్మించారు.అప్పటినుండి భక్తులు సందర్శిస్తూ తమ కోరికలను ముడుపుల రూపంలో కడుతూ  తమ భక్తిని చాటుకుంటున్నారు. అలాగే భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు.
మహిషాసుర పాదాలు:
పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు భైంసాలోని కొండలలో ఉంటూ చుట్టూ ప్రక్కల ప్రజల్ని అనేక బాధలకు గురిచేస్తూ ఉండడంతో ప్రజలు శక్తిమాత అయిన దుర్గామాతను వేడుకోవడంతో దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించడంతో మహిషాసురపాదాలు తెగిపడినవని పురాణ కథనం కలదు. మైసమ్మ గుట్ట దగ్గరలో తెగిపడిన రాతిపాదాలు ఇప్పటికీ ఉన్నాయి.
ప్రాచీన కట్టడాలు:
1. గట్టుమైసమ్మ విగ్రహం:
గట్టు మైసమ్మ విగ్రహం అతిప్రాచీనమైంది. పురాణకాలంనుంచి ఇక్కడ గుట్టలలో ఉన్న ఈ విగ్రహం అనేక ఏండ్లుగా గుట్టల్లో దాగి ఉంది.పూర్వీకులు ఆ విగ్రహాన్ని గుర్తించి పూజలు ప్రారంభించారు. ఆ రాతి విగ్రహంపై నవనాగులు కలవు.అలాగే విగ్రహం వెనకాల పెద్ద జడ కలదు.
2.ఓంకారేశ్వర్ మహదేవ్ మందిర్:
ఓంకారేశ్వర్ మహదేవ్ మందిర్ సిద్దార్థనగర్ ఆవల చెరువు గట్టుపై ఉంది.ఇది అతి ప్రాచీనమైన గుడి.ఇక్కడి గుడిపై ఉన్న ఓ స్థంభంలో ప్రాచీనకాలం నాటి లిపిలో వివరాలు రాయబడిఉన్నవి. బహుశ పూర్వం శాతావాహనులకాలం అయి ఉండొచ్చు.ఇక్కడి గుడిలో రెండు గుడులు కలిసిఉన్నాయి. ఒక గుడిలో శివలింగం ఉంది.మరో గుడిలో దత్తాత్రేయ విగ్రహం కలదు. ఇక్కడ శివరాత్రి మరియు దత్తజయంతి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఈ గుడిలో 28 స్థంభాలు కలవు.ఈ ఆలయం ఒకే రాతితో చెక్కబడిఉంది.
ఈ ఆలయం ప్రక్కనగల చెరువు లో దాదాపు 40 దేవాలయాలు నిర్మించబడిఉండేవని తెలుస్తుంది. ఇవి నేడు లభించుటలేదు.చెరువు మధ్యలో విడిది చేయడానికి నిర్మాణాలు ఉండేవి. వాటి ఆనవాళ్ళు నేటికి కలవు.
3.దిగుడుబాయి:
పురాణ బజార్ లోని మహిమయి మాతా ఆలయప్రాంగణంలో పురాతనకాలంనాటి దిగుడుబావి కలదు.ఈ బాయి రాతితో నిర్మించబడింది.ఈ బావిలోనికి వెళ్ళేందుకు మెట్లు ఉన్నాయి.ఈ మెట్ల ప్రక్కన ఒక ధ్యానమందిరం కలదు.బావిలో నిండినటువంటి నీరు బయటకు రావడానికి రెండు నీటిద్వారాలు నిర్మించబడి ఉన్నవి.
4. కాలభైరవ విగ్రహం:
శనీశ్వర దేవాలయం పురాణ బజార్ లో ఉంది. ఇక్కడ అతిప్రాచీన కాలభైరవుడి విగ్రహం కలదు.కాలభైరవుడు శంకరుని అవతారం. కాలభైరవుడి విగ్రహం బండరాయితో చెక్కబడి ఉంది. ఇక్కడి ప్రజలు దీనిని శనీశ్వర మందిర్ గా భావించి రావడంతో 1967 లో ఇక్కడ నవ గ్రహాలను ప్రతిష్టించారు. ఇక్కడ శనివారం అమావాస్య రోజున భక్తులు తండోపతండాలుగా వస్తారు.
5.నర్సింహ్మాస్వామి దేవాలయం:
భైంసాలోని నర్సింహానగర్ లో నర్సింహ్మాస్వామి దేవాలయం కలదు. ఇక్కడ బండరాయితో తొలచిన నర్సింహ్మాస్వామి విగ్రహం అలాగే మందిరం కలదు.

భైంసా పండుగలు:
1.ఎడ్ల పొలాలు:
భైంసా ప్రాంతంలో పొలాల అమావాస్య ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగ. దీనినే "ఎడ్ల పొలాలు" అని అంటరు. ఇది రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్లను పూజించటమే దీని ప్రత్యేకత. భైంసా వాసులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తరు.ఇక్కడ పత్తి, సోయలు, మినుములు ఎక్కువగా పండిస్తరు.
ఈ పండుగ అమావాస్యకు ముందురోజు ప్రారంభమైనా కోలాహలం మాత్రం వారం ముందనుంచే ఉంటది.పండుగ ముందురోజు సాయంత్రం చాటగుల్లలో దోసకాయ, మొక్కజొన్న లు వేసి వాటికి ఉప్పును కలిపి ఎడ్లకు, ఆవులకు,లేగలకు పెడతారు.ఇక హారతి సరేసరి.ఈ విధంగా చేయడాన్ని ఉప్పులు అంటారు.
ఇక అమావాస్య రోజు ఉదయాన్నే లేసి కల్లాపిజల్లి ముగ్గులు పెడతారు. గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు.ఇంటి పరిసర ప్రాంతంలో, పశువుల కొట్టంలో మొరం వేసి చదును చేస్తారు.గడప దగ్గర మోదుగ కొమ్మ టేకు కొమ్మ ఉంచుతారు. ఇక ఇంటిల్లిపాది స్నానాలు ఆచరించి పూజగదిని అలంకరించి దీపారాధన చేస్తారు. కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలు తెచ్చుకుంటరు.వాటికి రంగులు వేస్తరు. లేదంటే గాంధీ గంజ్ లో రెడీమేడ్ గ దొరికేవి కొనుగోలు చేస్తరు.జత ఎడ్లు,ఒక ఆవు,ఒక లేగ బొమ్మలు కొంటరు. వాటిని తెచ్చి పూజగదిలో ఉంచి పూజ చేస్తరు.
ఇక ఎడ్లకు స్నానంబోసి కొమ్ములకు రంగులు వేస్తరు.అట్నే అంగట్లో తెచ్చిన ఎడ్ల అలంకరణ సామాగ్రి కొత్తపగ్గం, బెల్టు, గోండలు, నార మొదలగునవి వేస్తరు.రంగురంగుల వస్త్రం మీద వేస్తరు. రంగులు చల్లుతరు. సాయంత్రం నేతాజినగర్ లోని హనుమాన్ల గుడి దగ్గరకు డప్పుచప్పుళ్ళతో జనాల కోలాహలంతో ఊరేగింపుగా ఎడ్లను తోలుకొని వస్తరు.
పాండ్రిగల్లి దగ్గర నుంచి తిర్ణాల్ల జాతరలెక్క ఉంటది. అక్కడ రావిచెట్టు దగ్గర నేతాజి యువజన సంఘం ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటుజేస్తారు. ఎడ్లకు హారతి ఇచ్చిన ఒకతను ముందు కాగడా పట్టుకొని నడుస్తుండగా ఆ వెంటనే రైతులు తమ అలంకరించిన ఎడ్లను రోకడ్ హనుమాన్ల గుడి చుట్టూ తిప్పుతారు. చేతిలోని అక్షింతలను ఎడ్లపై వేసి సల్లంగా ఉండాలని దీవిస్తారు. గుడి చుట్టూ తిరిగినంక రైతులు ఎడ్లను తమ ఇంటికి తోలుకపోయి హారతిచ్చి ఆకులో నైవేద్యం సమర్పిస్తరు.ఈ పండుగకు పిండివంటలుగా పోలాలు, కుడుములు వంటివి చేస్తరు.ఇంటిల్లిపాది టేకు ఆకులోనే లేదంటే మోదుగ ఆకుతో కుట్టిన విస్తర్లలోనో భోజనం చేస్తరు.ప్రకృతిని పూజించడం తమకు ఉపయోగపడే పశువులను పూజించడం, పండుగ చేయడం ఇక్కడి జనాల సంస్కృతిలో అంతర్భాగం.
2.గణేషుల పండగ:
గణపతి ఉత్సవాలు భైంస సంస్కృతిలో భాగం.తొమ్మిది దినాలు ఏడ చూసిన పండగ వాతావరణమే కన్పిస్తది.అందరు పూజలు,పునస్కారాలతో భక్తిపారవశ్యంలో పరవశులవుతారు. బండారిలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఏడ చూసినా కోలాహలం ఉంటుంది ప్రతి గణపతి మండపం వద్ద లడ్డు, కండువ, ఖాతా రోకడ్ బుక్ ఉంచుతారు.
 గణేష్ నిమజ్జనం చాలా భారిఎత్తిన చేస్తారు.వివిధ వాహనాలపై కొలువుదీరిన గణేషులు డప్పుచప్పుళ్ళు, బ్యాండ్ వాయిద్యాలు, డిజె హోరులతో ఊరేగింపుగ రావడంతో వాటిని చూసేందుకు వీధులనిండా ఇసుకేస్తే రాలనంత జనం చుట్టు ప్రక్కల ఊర్లలనుండి వస్తారు. ఒకవైపు బండారలు, ప్రసాదాలు, పలిహోరల పంపిణి.మరోవైపు కోలాటాలు, డప్పునృత్యాలు, కళాకారుల పాటలు, డిజె నృత్యాలతో కన్నులపండువగ ఉంటుంది. భైంసాలోని అన్నీ వీధులగుండా ఊరేగింపుగా గణపతులను తీసుకెళ్ళి గడ్డన్న వాగులో నిమజ్జనం చేస్తారు.
3. దేవి నవరాత్రి ఉత్సవాలు:
దసరా పండుగ సందర్భంలో దుర్గామాతలు ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాత "మహిషాసుర మర్థిని"గా గట్టు మైసమ్మగా ఇక్కడ వెలియడంతో దేవినవరాత్రి ఉత్సవాలకు భైంసా సంస్కృతి లో ప్రాధాన్యత ఉంది.
4. బోనాలు:
"బోనం" అంటే భోజనం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి లో అంతర్భాగం. ప్రజలు బోనాలను మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ తదితర దేవతలకు సమర్పిస్తారు.
5. బతుకమ్మ:
బతుకమ్మ పండుగ పూల పండుగ. మహాలయ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా మొదలై తొమ్మిదిరోజులపాటు కొనసాగి సద్దుల బతుకమ్మ తో ముగుస్తది. బతుకమ్మ పండగ తెలంగాణ లో మాత్రమే కనిపించే ప్రత్యేక పండుగ. బతుకమ్మ పండుగ కు ముందు పిల్లలు ఆడే బతుకమ్మను బొడ్డెమ్మ అంటారు.
సాంఘిక-మత పరిస్థితులు:
భైంసా లో హిందూ ముస్లిం సంస్కృతి కనిపిస్తుంది. కొంచాల గుట్టపై జరిగే ఉర్సులో ముస్లింలతోపాటు హిందువులు కూడా పాల్గొంటారు. ప్రజలు అనేక కుల వృత్తులతో పాటు, వ్యవసాయం, పత్తిమిల్లులలో పనిచేస్తారు. సంస్కృతి సాంప్రదాయాలపరంగా మహారాష్ట్ర సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. కొంతమంది బౌద్దమతాన్ని కూడా పాటిస్తున్నారు.
ఉపసంహారం:
భైంసా లో పురాణ బజార్ లో ప్రాచీన కట్టడాల ఆనవాళ్ళు, గట్టు మైసమ్మ, మహిషాసుర రాతిపాదాలు, అనేక ప్రాచీన దేవాలయాలు కలవు. వీటన్నింటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందిచాల్సి ఉంది. అలాగే వీటిని ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలి. ప్రతీ ప్రాచీన కట్టడం గురించి పూర్తిస్థాయిలో పరిశోధన చేసి ఎన్నో విషయాలను వెలికితీసి గ్రంథస్థం చేయాల్సి ఉంది.

Thursday 8 February 2018

జిఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా, జిల్లా.నిర్మల్
కళాశాల రిపోర్టు : మన డిగ్రీకళాశాల 1995-96 సంవత్సరానికి గాను BA,BCom కోర్సూలతో600ల మంది విద్యార్థులతోఏర్పాటైంది.తర్వాత2007-08 లో BSc.MPC,BSc.BZCలతో up grade అయింది. ప్రస్తుతం 2017-18 విద్యాసంవత్సరానికిగాను మన గౌరవనీయులైన MLA శ్రీ జి.విఠల్ రెడ్డి గారి క్రృషీ తొ BA(HEP),BSc(BZC)U/M, మరియు BSc( MPc),BCom(gen)E/Mతో నాలుగు కోర్సు లు మన తెలంగాణా ప్రభు త్వం మంజూరు చేసింది.ఇందుకుగాను గౌ".MLA గారి కి సభాముఖంగా కళా శాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.2017-18 సంవత్సరానికి గానుBA 50BCom10 MPC 14 BZC 65u/m&e/m కలిపి 73 అడ్మిషన్ లు అయినవి.
నేడు 22 వసంతాలు పూర్తి చేసి 23 వ సంవత్సరంలో కి అడుగిడింది.
ప్రస్తుతం కళాశాల కు కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్నుండి పర్మనేంట్ అఫిలియేషన్ ను, యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్  న్యూ డెల్లీ నుండి2(f), మరియు 12(b) స్టే టాస్ కలిగి ఉంది. సమీప భవిష్యత్తులో Naac గుర్తింపు రావడానికి మాశక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాము.ఇవన్నీ కూడా కళాశాల అభివృద్ధి కి సుచికలు.
మన కళా శాల లో 2 డీజీ టోల్  క్లాస్ రూం లు,   TSKC Lab,English language Lab.తో90 మరియు   digital Library కొరకూ 14 కంప్యూటర్లు కలవు. గౌ". MLA గారి నియోజకవర్గం అభివృద్ధి నిధులు మంజూరు తోELL Lab ను అన్నీ హంగుల తో ఈ మధ్య నే పుర్తి చెయఢమైనది.దీని ద్వారా   MS Office, Libre Office, soft skills and spoken English  ను విద్యార్థులకు నేర్పించ డం జరుగుతుంది.
గత సంవత్సరం  రూ.2,00,000/-లతో   1500 పుస్తకాలు కొనుగోలు చేసి Library ని అభివృద్ధి చేయడ మైనది.2014-15 లొ రూ.54,00,000/- అదనపు గదలు,సైన్సు ల్యాబ్స్ నిర్మాణం, కొరకు ఈసంవత్సరం 3,40,000 TSKC Lab నిర్మాణం కోసం మంజూరైనవి.కానిఈ పనులు TsEwidc Adilabad  వారి వద్ద  పెండింగ్లో ఉన్నాయి.
2017-18 కి గాను కళాశాల విద్యాశాఖ చేపట్టిన JIGNASA  students study project  లలో        History, Chemistry,Commerce and Botany లో20 మంది విద్యార్థులు  జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కి చేరుకున్నారు.ఇందులొ Botany, chemistry and Commerce లో 15 విద్యార్థులు  తమ సత్తా చాటారు.
యువతరంగం2017-18 కార్యక్రమంలో  sumaia begum u/m విద్యార్థి కథా రచన పోటీలొ పాత జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి లో సత్తా చాటారు.అలాగే J.Rahul ఉపన్యాసం ,R.Pujitha పరిశీలన ప్రకటన, K.Rathnamala జానపద గేయాలు, M.Lakshmi కార్టునింగ్ లో జిల్లాలో ద్వితీయ బహుమతి సాధించొరు.కాకతీయ యునివర్సిటీ నిర్వహించిన యువజనోత్సవం లోJ.Rahul ఉపన్యాసం ద్వితీయ బహుమతి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఉపన్యాసం పోటీ లో    J.Rahul ప్రథమ,K.Nagendhar,R.Sangeeth లు వరుసగా ద్వితీయ బహుమతి  గౌ".కలెక్టర్ చేతుల మీదుగా పొందారు.
వార్షిక ఫలితాలు చుసినట్లయితె  BA.53 %Bacom17%BSc23 %.
మన పూర్వ విద్యార్ధుల విషయానికి వచ్చేసరికి
Sai Kiran maths OU Suryaprasad Eco OU, Umarani maths.ou,Laxmi Prasanna maths OU Deepak maths Ku, Rajashekar Telugu,TU,Azruddin Hindi Tu,,Bhumesh Bot ou P sandya Zoo K.Mounika  MCom P.Laxmi HIn .

B.Krishna Rao BCOm   business anAlyst at singapur, G.Machendar BCOmseniar  finance manager at Dubai.B sampath CA at bhainsa. Madhavi,devudaa  Lawyers at bhainsa. G.Anil Shivaji at army.
ఇట్లాంటి విద్య ర్థులను ఆదర్శం గా తీసుకుని ఉన్నంత గా ఎదుగాలనీ కొరుకుతున్నాను., అంతే కాకుండా వచ్చే విద్యా సంవత్సరంలొ కూడా కళాశాల అడ్మిషన్ లు పెంచడం లో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలనీ కొరుకుతున్నాను.
జైహింద్, జై తెలంగాణ.

Saturday 30 January 2016

             గోపాల్ రావు పటేల్  ప్రభుత్వ డిగ్రీ కళాశాల,భైంసా ,ఆదిలాబాద్ 
                           జాతీయ సేవా పథకం  ప్రత్యేక  శీతాకాల శిబిరం 
                               సామాజిక ఆర్థిక సర్వే                                                                 గ్రామం:పేండ్ పల్లి             మండలం: భైంసా                     ఐడి నెం                  
          1.   కుటుంబ యజమాని పేరు: ----------------------  ఇంటి నెం ------
               కుటుంబ సభ్యుల సంఖ్య :------పు:----- స్త్రీలు :-----పిల్లలు---------
              కుటుంబ యజమాని వృత్తి:----------- యజమానురాలి వృత్తి------- 
         2.   చదువుకున్నవారు  ఎంతమంది? -------------
               ఏం చదువుతున్నారు? స్కూల్ [  ]/ ఇంటర్ [  ]/డిగ్రీ [  ]/ పీజీ [  ]/అంగన్వాడి [ ]
         3.  సామాజిక వర్గం : SC [  ] / ST[  ] / BC[ ] OC [  ] OTHER [  ]
         4.  వృద్ధులు  [  ] / వితంతువులు  [  ] / వికలాంగులు [  ] /
             పించన్  వస్తుంది? [  ] / రావట్లేదు [  ]
         5.  నివాస స్థితి: గుడిసె [  ] / పెంకుటిల్లు [ ]/ రేకులిల్లు[  ]/ డాబా ఇల్లు[  ]/ అద్దె ఇల్లు[ ]
        6. త్రాగునీటి వసతి: ప్రభుత్వ కుళాయి[  ]/ స్వంత కుళాయి[  ]/బోరు[  ] /చేతిపంపు [  ]
        7.  వంట గ్యాస్ వాడుతున్నారా? [  ] / కట్టెల పొయ్యి వినియోగం [  ]
        8.  విద్యుత్ వసతి ఉన్నది {  ] / లేదు [  ]
        9.  మరుగుదొడ్డి ఉన్నది [  ] / లేదు [  ]
      10. మురుగునీరు ఎక్కడికి వెళ్తుంది? మురుగుకాల్వలోకి [ ] / ఇంటి పరిసరాల్లోకి [  ]
      11. ఇంట్లోని చెత్తను ఎక్కడ వేస్తున్నారు? డంప్ యార్డు [ ]/ పెంటకుప్ప [ ]/ ఖాళి స్థలం [  ]
      12. ఇంకుడు గుంత ఉన్నది [  ] / లేదు [  ]
      13. వ్యవసాయ భూమి ఉన్నది [  ] / లేదు [  ] ఉంటె ఎన్నిఎకరాలు -----
      14. పెంపుడు జంతువులు ఉన్నాయా [  ] / లేవు[ ] కోళ్ళు [  ] కుక్కలు[  ] మేకలు[  ] పశువులు [  ]
      15. బడి మానేసినవారు ఉన్నారా?  [  ] / లేరు [  ]
            బడి మానేయుటకు గల కారణం  -------------------
      16. ఉద్యోగస్తులు: ఉన్నారు [  ] / లేరు [  ]
            ప్రభుత్వ  [  ]/ ప్రైవేటు [  ]/ స్వయం ఉపాది [  ]/ వ్యాపారం [  ]
      17. వాహన సౌకర్యం ఉన్నది [  ]/ లేదు [  ] బైక్ [  ]/ ట్రాక్టర్ [  ]/ ఆటో [  ]/ ఇతరత్ర [  ]
     18. గర్బిణి  స్త్రీలు ఉన్నారు [  ]/ లేరు [  ] వైద్యం ప్రభుత్వ [  ]/ ప్రైవేటు [  ]
     19. సమస్యలు ఏమైనా -------------------------------------------------
           వాలంటర్ సంతకం                                            ప్రోగ్రాం ఆఫీసర్ సంతకం 


Sunday 29 November 2015

Poolajaathara

...పూల జాతర...
తంగేడు పూలు తురమంగ
గునుగుకు రంగులు పులమంగ
మనసు మురవంగ
తనువు పులకరించంగ
ఆడుదాం బతుకమ్మ!
ఆడబిడ్డలు ఇంట అడుగిడంగ
చిన్ననాటి దోస్తులు కలవంగ
అన్నలు పూలు కోయంగ
ప్రకృతి పరవశించంగ
ఆడుదాం బతుకమ్మ!
చెరువుగట్లు పిలవంగ
వెంపలి చెట్లు నాటంగ
అవ్వలు పాటలు పాడంగ
పడచులు కోలాటమేయంగ
ఆడుదాం బతుకమ్మ!
చిన్నారుల టపాసులు పేల్చంగ
బతుకమ్మలు చెరువు ఒడిలో వొదగంగ
పప్పుబెల్లాల తీపి పంచుకోంగ
ప్రకృతిఒడిలో గడపంగ
ఆడుదాం బతుకమ్మ...!
     - Srinivas Pindiga

Wednesday 30 July 2014

మట్టి మనుషులు

వాళ్ళు మనుషులే
పనిమనుషులు!
ఎప్పుడు పిలిస్తే అప్పుడు
పనిచేసే శ్రామికులు!
మట్టి వాసనకు
మనిషి వాసనకు
తేడా తెలియని మనుషులు !
నెల రోజుల్లో ఒక్కరోజు కూడా
సెలవులేని అభాగ్యులు!
చాలిచాలని జీతంతో
సంసారసాగరం ఈదే నిర్భాగ్యులు!
పసిపిల్లల ముద్దుముచ్చట
 తీర్చలేని మౌనజీవులు!
కదిలే కాలచక్రంలో
 కండలు అరగదీసే కార్మికులు!
ఎప్పుడు పొద్దుపోడుస్తుందో
ఎప్పుడు పొద్దువాళ్తుందో
గుర్తేలేని శ్రమజీవులు!
జీవనపరుగులో అలిసిపోయి
బక్కచిక్కిపోయిన శరీరాలతో
మగ్గిపోయిన బ్రతుకులు
వర్కర్ల జీవితాలు. 

Monday 28 July 2014

గారాల పట్టి

SRINIVAS PINDIGA: gaaraala patti: గారాల  పట్టి  కొడుకైనా  కూతురైనా  నీవేనమ్మా నా   వరాలతల్లి! నీవు మా కళ్ళముందు వెలసిన క్షణమే హృదయం ఉప్పొంగి నాన్న కళ్ళు మెరిశాయి ! నిన...